స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌తో పీకల్లోతు ప్రేమలో కావ్యా మారన్ .. క్లారిటీ..

క్రికెట్ అభిమానులకు కావ్యా మారన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఐపీఎల్ సీజన్ లో ఆమె పేరు మారుమోగిపోతుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఓనర్ అయిన కావ్యా.. ఆ జట్టు ఆడే ప్రతి మ్యాచ్ కు హాజరవుతూ తన టీంకు ఉత్సాహపరుస్తుంటుంది. ఈ క్రమంలోనే క్రికెట్ చూస్తూ ఆమె ఇచ్చే ఎక్స్‌ప్రెష‌న్స్ సోష‌ల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. తన టీం గెలిస్తే చిన్నపిల్లలా మారిపోయి సంతోషంతో గంతులేస్తుంటుంది. ఇక జట్టు ఓడిపోతే మాత్రం బోరున ఏడ్చేస్తుంది. అందుకే నెట్టింట కావ్య ఫోటోస్, వీడియోస్ వైరలవుతుంటాయి.