అమెరికా అధ్యక్షుడిగా రెండో సారి బాధ్యతలు చేపట్టిన ట్రంప్ పలు సంస్కరణలు తీసుకొస్తున్నారు. ఆఫీసు నుంచే ఫుల్ టైం పని చేయాలంటూ ఫెడరల్ ఉద్యోగులకు ఆదేశాలిచ్చారు. దీంతో తమ కార్యాలయాలకు చేరుకున్న ఉద్యోగులకు ఊహించని అనుభవాలు ఎదురవుతున్నాయి. ఆఫీసులో ఎక్కడికక్కడ బొద్దింకలు తిరుగుతున్నాయని, కొంతమంది డెస్క్ లేకుండానే పనిచేస్తున్నట్లు ‘నాసా’ ఉద్యోగులు ఫిర్యాదు చేస్తున్నారు. వీటికి సంబంధించి అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.