మాజీ ప్రియుడిపై యాసిడ్ దాడి చేసిన యువతి

ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్ లో దారుణం జరిగింది. మాజీ ప్రియుడిపై ఓ యువతి యాసిడ్ దాడి చేసింది. ఇద్దరూ రెస్టారెంట్ లో కలుసుకుని మాట్లాడుకుంటుండగా మాజీ ప్రియుడిపై యాసిడ్ చల్లింది. దీంతో ముఖంపై తీవ్ర గాయాలు కావడంతో మాజీ ప్రియుడు ఆసుపత్రిలో చేరాడు. బాధితురాలు, పోలీసులు కొన్ని కీలక వివరాలు తెలియజేశారు. అలీగఢ్ లోని ఓ రెస్టారెంట్ కు శనివారం ఉదయమే ఓ యువతి వచ్చింది. ఆ తర్వాత కాసేపటికి యువకుడు వచ్చాడు.