మా అణ్వాయుధాలు ఇవిగో.. ట్రంప్‌ను రెచ్చగొడుతూ ఇరాన్‌ వీడియో

ఇరాన్‌.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను రెచ్చగొట్టింది. అమెరికాతో ఎట్టి పరిస్థితుల్లో అణు ఒప్పందం చేసుకోబోమని పరోక్షంగా ట్రంప్‌కు సంకేతాలిచ్చింది. 85 సెకన్ల నిడివిగల వీడియో విడుదల చేసింది. ఇటీవల ట్రంప్‌ ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీకి, ఇరాన్‌ అధ్యక్షుడు మసౌద్‌కు లేఖ రాశారు. ఇరాన్‌తో అణు ఒప్పందం చేసుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, ఇరాన్‌ను చర్చలకు ఆహ్వానించారు. అందుకు సుమారు రెండు నెలల డెడ్‌లైన్‌ విధించారు. ఆ లేఖపై మసౌద్‌ స్పందిస్తూ ట్రంప్‌తో చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా లేమని, ఆయనకు ఇష్టమొచ్చింది చేసుకోవచ్చు అన్నారు.