డ్రోన్ విజువల్స్ .. చెన్నైలో ఎటు చూసినా నీరు! - Tv9

తమిళనాడులో జల విలయానికి కారణమైన తుఫాన్‌ ఏపీలోనూ బీభత్సం సృష్టించింది. మంగళవారం మధ్యాహ్నం బాపట్ల సమీపంలో తీరం దాటిన తుఫాన్‌ వేలాది ఎకరాల్లో పంట నాశనం చేసింది. అటు రాయలసీమలో, ఇటు తెలంగాణలో తుఫాన్‌ ప్రభావంతో భారీ వర్షాలు నమోదయ్యాయి. కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో 96.8 మి.మీ వర్షం కురిసింది. బుధవారం కూడా తెలంగాణలో కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. వర్షాల నేపథ్యంలో, అన్ని రకాల సహాయక చర్యలను చేపట్టాలని ముఖ్యమంత్రి పదవిని చేపట్టబోతున్న రేవంత్ రెడ్డి అధికారులను కోరారు.