ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టిస్తోంది కల్కి 2898 ఏడి. జూన్ 27న రిలీజ్ అయిన సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ సునామీ సృష్టిస్తోంది. ఇక ఈ క్రమంలోనే ఈ మూవీలో కీ రోల్ ప్లే చేసిన సెలబ్రిటీల రెమ్యునరేషన్‌కు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. అందులోనూ విజయ్ దేవరకొండ తన ఫ్రెండ్ డైరెక్టర్ నాగ్ అశ్విని ఫ్రెండ్ షిప్‌కి వ్యాల్యూ ఇచ్చి సినిమాకోసం ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోకపోవడం.. ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది. అందర్నీ ఫిదా అయ్యేలా చేస్తోంది.