'మరణాన్ని శాసించే డాకూ మహరాజ్‌' అదిరిపోయిన టీజర్

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. NBK109 అనే వర్కింగ్ టైటిల్‏తో రూపొందుతున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతోంది. భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా వస్తోన్న ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు ఇదివరకే చిత్రయూనిట్ ప్రకటించింది.