అమెరికా అధ్యక్షుడిగా రెండో సారి పగ్గాలు చేపట్టి డొనాల్డ్ ట్రంప్ పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో తుపాకీ బుల్లెట్ నుంచి తన ప్రాణాలు కాపాడిన సెక్యూరిటీ ఏజెంట్ సీన్ కరన్ కు మంచి పదవి కట్టబెట్టారు. అతడిని ఏకంగా అమెరికా సీక్రెట్ సర్వీసెస్ డైరెక్టర్‌గా నామినేట్ చేశారు. గతేడాది పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచార సభలో ట్రంప్‌పై హత్యాయత్నం జరిగింది.