యూపీ అబ్బాయి.. నెదర్లాండ్స్ అమ్మాయి.. - Tv9

ప్రేమకు కళ్లే కాదు... హద్దులు కూడా లేవని నిరూపిస్తున్నారు ఈతరం ప్రేమికులు. దేశం ప్రాంతంతో సంబంధం లేకుండా యువతీ యువకులు ప్రేమలో పడుతున్నారు. పెద్దల అంగీకారంతో ఒక్కటవుతున్నారు. తాజాగా నెదర్లాండ్స్‌ అమ్మాయి, యూపీ అబ్బాయి మధ్య ఏర్పడిన ప్రేమ పెద్దల అంగీకారంతో పెళ్లిపీటలెక్కింది. ఈ పెళ్లి వేడుకలో బంధుమిత్రులే కాకుండా రాజకీయ ప్రముఖులు కూడా అతిథులుగా హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు.