వైవిధ్యమైన కథలతో సినిమాలు చేస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటున్నాడు హీరో సుహాస్. ఈ కోవలోనే అతను నటించిన తాజా చిత్రం ‘గొర్రె పురాణం’. బాబీ తెరకెక్కించిన ఈ డిఫరెంట్ మూవీలో పోసాని కృష్ణ మురళి, రఘు ప్రధాన పాత్రలు పోషించారు. సెప్టెంబర్ 20న విడుదలైన గొర్రె పురాణం సినిమా డీసెంట్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరు విజయం సాధించింది.