నువ్వు సూపర్.. అందుకో మా గిఫ్ట్ - Tv9

హైదరాబాద్‌ పాతబస్తీలోని చంచల్‌గూడకు చెందిన మహ్మద్‌ ఫారూఖ్‌ తన బైక్‌లో పెట్రోల్‌ అయిపోవడంతో బంక్‌ దగ్గరికి వెళ్లి దాదాపు 3 గంటలకుపైగా క్యూలో వేచిచూశాడు. ఎంతకీ పెట్రోల్‌ దొరకలేదు. దీంతో వినూత్నంగా ఆలోచించాడు. ఎలాగైనా ఫుడ్‌ను కస్టమర్లకు అందించాలనే ఉద్దేశంతో తన అన్న దగ్గరికి వెళ్లి బైక్‌ను అక్కడ పెట్టి సోదరుడి దగ్గర ఉన్న గుర్రాల్లో ఒకటి తీసుకుని రోడ్లపై పరుగులు పెట్టించాడు. వీపునకు జొమాటో బ్యాగ్‌ వేసుకుని ఎంచక్కా ఆర్డర్స్‌ను కస్టమర్లకు వేగంగా అందించాడు. రోడ్లపై జొమాటో బాయ్‌ని చూసిన జనం ఆశ్చర్యపోయారు. సోషల్‌ మీడియాలో డెలివరీ బాయ్‌ గుర్రపు స్వారీ వీడియో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజెన్లు డెలివరీబోయ్‌ సమయస్పూర్తికి ఆశ్చర్యపోయారు.