Viral కుప్పకూలిన ఫ్లైఓవర్ .. Flyover Collapse - Tv9

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ ఫ్లైఓవర్‌ కూలిపోయింది. ముంబయి-గోవా హైవే మార్గంలోని రత్నగిరి జిల్లాలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. నిర్మాణంలో ఉన్న ఈ ఫ్లైఓవర్‌కు పగుళ్లు రావడంతో ప్రమాదం జరిగినట్టు అధికారులు పేర్కొన్నారు.