అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజలకు మేమున్నామని భరోసా ఇచ్చేందుకు పోలీసులు కవాతు నిర్వహిస్తున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో కేంద్ర బలగాలతో కలిసి స్థానిక పోలీసులు కవాతు నిర్వహించారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినిగించుకోవచ్చని ప్రజాస్వామ్య విరుద్ధంగా వ్యవహరించే వారికి తగిన చర్యలు తప్పవని సందేశం ఇచ్చేందుకు కవాతు నిర్వహిస్తున్నట్లు డి.ఎస్.పి సీతారామయ్య తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రజలు ఎవరు కూడా ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.