బ్యాక్టీరియల్ నిమోనియాకు సంబంధించిన ఒక కొత్త రకం ఇన్‌ఫెక్షన్ చైనా, డెన్మార్క్, అమెరికా, నెదర్లాండ్స్‌ను వణికిస్తోంది. ‘వైట్ లంగ్ సిండ్రోమ్’గా పిలుస్తున్న ఈ రుగ్మత ప్రధానంగా 3-8 ఏళ్ల వయసు చిన్నారులకు సోకుతోంది. ఈ వ్యాధి బాధితుల ఊపిరితిత్తులకు స్కాన్ నిర్వహించినప్పుడు తెల్లరంగు మచ్చల్లాంటివి కనిపిస్తున్నాయి. అందువల్లే దానికి ఆ పేరు పెట్టారు. మైక్రోప్లాస్మా నిమోనియా అనే బ్యాక్టీరియాలోని కొత్త వేరియంట్‌తో ఈ ఇన్‌ఫెక్షన్ వస్తున్నట్లు భావిస్తున్నారు. చాలా రకాల యాంటీబయాటిక్స్ దీనిపై పనిచేయవని నిపుణులు చెబుతున్నారు.