ఇప్పటికే నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పుడు ఉల్లి ప్రజలను ఏడిపించేందుకు సిద్ధమవుతోంది. వంటింట్లో పొయ్యి వెలిగించాలంటే ఆలోచిస్తున్నారు సామాన్య ప్రజలు. మొన్నటిదాగా కిలో రూ.20-30 పలికిన కిలో ఉల్లిగడ్డ ధర ఢిల్లీలో ఇప్పుడు ఏకంగా రూ.80 పలుకుతుంది.