యూపీలో మరో ఘోరం.. ఒప్పుకోలేదని రైలు కింద తోసేసిన యువకులు - Tv9

ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన దుండగులు బాలిక ప్రతిఘటించడంతో ఆమెను తీసుకెళ్లి రైలు కింద పడేశారు. తీవ్రగాయాలతో బాలిక చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ దారుణ ఘటన బరేలి సిటీలో అక్టోబరు 10న చోటుచేసుకుంది.