వెంటాడుతున్న 2014 నాటి గాజా యుద్ధం కేసు - Tv9

కాల్పుల విరమణ చర్చలు కీలక దశకు చేరుకుంటున్న వేళ.. ఇజ్రాయెల్‌కు అంతర్జాతీయ నేర న్యాయస్థానం భయం పట్టుకుంది. 2014 నాటి గాజా యుద్ధం కేసులో తమ సైనిక అధికారులు, నేతలపై ఐసీసీ అరెస్టు వారెంట్లు జారీ చేయొచ్చన్న వార్తలపై ఆందోళన చెందుతోంది. ఈ ఊహాగానాలపై ఐసీసీ నుంచి ఎటువంటి సూచనలు లేనప్పటికీ, విదేశాంగశాఖ మాత్రం ఇతర దేశాల్లోని తమ రాయబార కార్యాలయాలను అప్రమత్తం చేసింది.