5 రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెడుతూ.. బంగారం, వెండిపై కస్టమ్స్ డ్యూటీని 6%కి తగ్గించినట్లు ప్రకటించారు. ఈ క్రమంలో జులై 23 నుంచి దేశంలో బంగారం ధరలు క్షీణిస్తూ వస్తున్నాయి. మరోవైపు చైనాలో ఈ పసుపు లోహానికి డిమాండ్ తక్కువగా ఉండటంతో భౌతిక బంగారానికి భారీ నష్టం కలిగించిందని, దీంతో ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు తగ్గాయని నిపుణులు చెబుతున్నారు.