సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటి సుబ్బలక్ష్మి అనారోగ్యంతో కన్నుమూశారు. పలు తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లోనే కాకుండా బాలీవుడ్‌లోనూ నటించి తనదైన ముద్ర వేసుకున్న నటి ఆర్.సుబ్బలక్ష్మి గురువారం కేరళలోని కొచ్చిలో కన్నుమూశారు. 87 సంవత్సరాల సుబ్బలక్ష్మి.. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం మృతి చెందినట్టు ఆమె మనవరాలు సౌభాగ్య వెంకటేశ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించారు. సుబ్బలక్ష్మి మరణవార్త విని సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది.