రెండో విడత రుణ మాఫీ.. ఎవరికి వర్తిస్తుందంటే..!

తెలంగాణ రైతులకు మరో గుడ్‌ న్యూస్‌ చెప్పింది ప్రభుత్వం. జూలై 30న రెండో విడత రుణమాఫీ చేయనుంది. మొదటి విడతలో భాగంగా రూ.లక్ష లోపు రుణాలను మాఫీ చేసింది కాంగ్రెస్ సర్కార్. 11 లక్షల 50 వేల మంది రైతుల ఖాతాల్లో 6వేల 98 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. జూలై 30న రెండో విడతలో భాగంగా లక్షన్నర వరకు రుణమాఫీ నిధులు విడుదల చేస్తారు. ఆగస్టు మొదటి లేదా రెండో వారంలో.. 2 లక్షల రుణమాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణలో రైతుల రుణమాఫీ కోసం మొత్తం 31 వేల కోట్ల రూపాయలు కేటాయించారు.