ఈ మధ్యకాలంలో భార్య భర్తల మధ్య చిన్నచిన్న విషయాలకే మనస్పర్థలు వస్తున్నాయి. దాంతో కొట్టుకోవడం, లేదా చంపుకోవడం వంటివి చేస్తున్నారు. మొన్నటికి మొన్న పుట్టినరోజు వేడుకలకు తీసుకెళ్లలేదని భర్త ముక్కుపై తీవ్రంగా కొట్టింది ఓ మహిళ. ఆ ఘటనను ఇంకా మరువకముందే మరో మహిళ ఏకంగా భర్త చెవి కొరికేసింది. వేరు కాపురం పెట్టాలంటూ భర్తను వేధించింది. అందుకు అతను అంగీకరించక పోవడంతో ఏకంగా తన చెవినే కొరికేసింది.