మియాపూర్ లో రూ.20 కోట్ల ఖరీదైన శునకం - Tv9

సాధారణంగా పెట్‌ డాగ్‌ ఖరీదు ఎంత ఉంటుంది.. మహా అంటే వేలల్లో ఉంటుంది. మరీ ఎక్కువ అనుకుంటే లక్షల్లో ఉండొచ్చు. కానీ ప్రస్తుతం ఈ శునకాల రేటు కూడా కోట్లలో పలుకుతోంది. అవును, ప్రపంచంలో అత్యంత ఖరీదైన, అరుదైన జాతి కుక్క ఒకటి హైదరాబాద్‌ మియాపూర్‌లో సందడి చేసింది. కాకసియాన్ షెఫర్డ్ జాతికి చెందిన ఈ డాగ్ ఖరీదు ఏకంగా 20 కోట్లు. శనివారం మియాపూర్‌లోని విశ్వ పెట్‌ క్లినిక్‌కు ఆరోగ్య పరీక్షల కోసం శునకాన్ని తీసుకువచ్చారు.