వాట్సాప్‌ కాల్స్‌తో వణికిపోతున్న జనం ఎందుకో తెలుసా

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్లలో కొందరికీ అప్పుడప్పుడు ఫేక్ కాల్స్, స్పామ్ మెసేజెస్ వస్తుంటాయి. తెలిసీ తెలియక కాల్ లిఫ్ట్ చేసినా, మెసేజ్‌లోని లింక్‌లపై క్లిక్ చేసినా మోసపోయినట్లే. క్షణాల్లో ఫోన్ హ్యాక్ కావడం లేదా బ్యాంక్ బ్యాలన్స్ మాయమవడం జగిరిపోతుంది. అంతేనా.? మీ వాట్సాప్‌లోని చాట్‌లతో పాటు, యాప్ వాయిస్, వీడియో కాల్‌లకు కూడా యాక్సెస్‌ సైబర్ నేరగాళ్ల చేతుల్లో ఉంటుంది.