ఇది అట్టాంటిట్టాంటి కరోనా కాదు. కరోనా 'కింగ్‌సైజ్'. మనల్ని చావు అంచుల దాకా తీసుకెళ్లిన కరోనా మహమ్మారి... అవతారం మార్చుకుని మళ్లీ ముంచుకొస్తోంది. లక్షలాది మందిని మంచం పట్టించి.. లక్షలాది మందిని మృత్యువుకి అప్పజెప్పిన అదే కరోనా... మరో ఉప రకంతో ఉప్పెనై వస్తోంది. ఇది కనుక సోకిందంటే నేరుగా మరణమేనట. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి పీడ ఇంకా పోలేదు. కొవిడ్ మహమ్మారి మరో కొత్త రూపు దాల్చింది.