తిరుమలలో కల్తీ నెయ్యి వివాదం కొనసాగుతున్న వేళ భారత చైతన్య యువజన పార్టీ బీసీవై జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్రయాదవ్ ముఖ్య ప్రకటన చేశారు. టీటీడీకి తాను వెయ్యి గోవుల్ని ఇస్తానని, వాటితో డెయిరీ ఫాం పెట్టి నెయ్యి తయారుచేసి ఆ నెయ్యినే లడ్డూ ప్రసాదాలకు ఉపయోగించవచ్చంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి లేఖ రాశారు.