Viral చిన్నారి శరీరంపై రాముడు, రాధ పేర్లు.. వాటికవే పుట్టుకొచ్చాయంటున్న స్థానికులు - Tv9

ఆధునిక కాలంలో కూడా సైన్స్ కు, వైద్యులకు సవాల్ విసురుతూ తరచుగా వింత ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్‌లో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. 8 ఏళ్ల బాలిక శరీరంపై రాధే-రాధే, రామ్-రామ్ అనే పదాలు వాటికవే పుట్టుకొస్తున్నాయి. మొదట శరీరంపై గీతల్లా కనిపించినా రాను రాను అవి రాధే.. రాధే, రామ్..రామ్ రూపాలు సంతరించుకుంటున్నాయి.