ఫోక్ సింగర్‏కు మాటిచ్చిన తమన్.. పవన్ కళ్యాణ్ ఓజీలో ఛాన్స్..

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 విజయవంతంగా రన్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ షోలో గీతా మాధురి, తమన్, విజయ్ యేసుదాస్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ షోలో కడప నుంచి వచ్చిన ఫోక్ సింగర్ లక్ష్మీ గాత్రానికి తమన్ ఫిదా అయ్యారు. ఆమె పర్ఫామెన్స్‏కు అందరూ స్టాండింగ్ ఓవియేషన్ ఇవ్వగా.. ఇంత అద్భుతమైన న్యాచురల్ టాలెంట్ ఉన్న ఫోక్ సింగర్ లక్ష్మీకి పవన్ కళ్యాణ్ సినిమా ఓజీలో పాడే అవకాశం అందించారు తమన్. తన సినిమాల్లో జానపద గాయకులకు తమన్ ముందు నుంచి అవకాశాలు ఇస్తున్న సంగతి తెలిసిందే.