లిఫ్ట్‌లో చిక్కుకున్న కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత

కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత లిఫ్ట్‌లో చిక్కుకున్నారు. బోయిన్‌పల్లిలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వెళ్లారామె. ఆ క్రమంలోనే లిఫ్ట్‌లోకి ఎక్కారు. ఓవర్ లోడ్ కారణంగా ఉన్నట్టుండి లిఫ్ట్‌ కిందకు పడిపోయింది. ఎమ్మెల్యే లిఫ్ట్‌‌లోనే ఉండిపోవడంతో అందరూ కంగారుపడ్డారు.