ఇజ్రాయెల్ హమాస్ మధ్య కొనసాగుతున్న భీకర యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికులు, సామాన్య యువకుల వీర్యాన్ని సేకరించేందుకు బాధిత కుటుంబీకులు ప్రయత్నిస్తున్నారు. చనిపోయిన విషయం తెలిసిన వెంటనే వారు వైద్య నిపుణులను సంప్రదిస్తున్నారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి 33 మంది నుంచి వీర్యాన్ని సేకరించినట్లు స్పెర్మ్ బ్యాంక్‌లు తెలిపాయి. ప్రస్తుతమున్న కొన్ని నిబంధనలను కూడా ఇజ్రాయెల్ ప్రభుత్వం తాజాగా సడలించడం గమనార్హం.