ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రతి సంవత్సరం దీపావళి పండుగను సైనికులతో జరుపుకుంటున్నారు. 2014లో దీపావళి సందర్భంగా సియాచిన్ గ్లేసియర్‌లో సైనికులతో కలిసి నరేంద్ర మోడీ దీపావళిని జరుపుకున్నారు. తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ 2015లో పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో సైనికులతో కలిసి జరుపుకున్నారు. ఈ సారి కూడా దీపావళి సంబరాలను మోదీ జవాన్లతో జరుపుకున్నారు. హిమాచల్‌ప్రదేశ్ లోని లెప్చా సెక్టార్‌లో జవాన్లతో దీపావళి సంబరాలు చేసుకున్నారు. ఎంతో కఠిన పరిస్థితుల్లో జవాన్లు తమ విధులను నిర్వహిస్తున్నారని మోదీ ప్రశంసించారు.