వినాయక నిమజ్జనంలో అపశ్రుతి..

హైదరాబాద్, సెప్టెంబర్ 30: హైదరాబాదులో గణేష్ నిమజ్జన ఉత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి. అయితే నిమజ్జనం ముగిసిన తరువాత రోజు ఆలస్యంగా ఓ ఘటన బయట పడింది. హైదరాబాద్ బన్సిలాల్ పేట్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ నిమజ్జనం సందర్భంగా విగ్రహాల ఊరేగింపు కొనసాగుతున్న తరుణంలో ఒక్కసారిగా వినాయకుడి విగ్రహం భక్తుల మీదకు పడిపోయింది. విగ్రహాన్ని పట్టుకునే ప్రయత్నం చేసిన ఫలితం లేదు. విగ్రహం కింద పడి నలుగురికి గాయాలు అయ్యాయి.