ఆదిలాబాద్ రిమ్స్ మెడికల్ కళాశాల ఆవరణలో అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు హల్చల్ చేశారు. క్యాంపస్ కి సంబంధం లేని బయట వ్యక్తులు క్యాంపస్ లో చొరబడి విద్యార్థులపై దాడులకు ప్రయత్నించారు. రిమ్స్ విద్యార్ధులు, ఆగంతకులకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో పలువురు విద్యార్థు గాయపడ్డారు. విద్యార్థులను కారుతో ఢీకొట్టి దుండగులు పరారయ్యారు. తమపై దాడి చేసి తప్పించుకునేందుకు ప్రయత్నించిన వారిపై వైద్య విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. రిమ్స్ ఆవరణలో భద్రత పెంచారు.