వామ్మో.. పశువుల పాక కమ్మల్లో 12 అడుగుల భారీ గిరి నాగు..

అనకాపల్లి జిల్లాలో భారీ గిరినాగు భుసలు కొట్టింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 12 అడుగుల కింగ్ కోబ్రా హడలెత్తించింది. మాడుగుల శివారులో భారీ కింగ్ కోబ్రా కలకలం సృష్టించింది. అర్జునరావు కల్లాలోని పశువుల పాకలో తన ఆవులను సంరక్షిస్తుండగా.. ఏవో శబ్దాలు వినిపించాయి. పైకి తొంగి చూసేసరికి.. కమ్మల్లో భారీ గిరినాగు కనిపించింది.