సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ కారణంగా వేధింపులకు గురైన నటీమణులు ఎందరో ఉన్నారు. అయితే నటీమణులకే కాదు కొందరు నటులకు కూడా ఇలాంటి చేదు అనుభవం ఎదురయ్యింది. ఇటీవలే కొందరు యాక్టర్లు ఈ విషయంపై మాట్లాడేందుకు ధైర్యంగా ముందుకొస్తున్నారు. తాజాగా క్యాస్టింగ్ కౌచ్ విషయంపై ‘యానిమల్’ సినిమా నటుడు సిద్ధాంత్ కార్నిక్ కూడా స్పందించారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన సంచలన విషయాలు బయట పెట్టారు.