కోవిడ్ వ్యాక్సిన్ రూపకర్త ... లండన్ లో రూ. 1444 కోట్లతో ఆస్తుల కొనుగోలు - Tv9

కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ను త‌యారుచేసిన సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో, బిలియ‌నీర్ ఆదార్ పూనావాలా లండ‌న్‌లో విలాస‌వంత‌మైన భ‌వ‌నాన్ని కొనుగోలు చేశారు. లండ‌న్‌లోని హైడ్ పార్క్ స‌మీపంలో 25,000 చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ల‌గ్జ‌రీ మ్యాన్ష‌న్ విలువ దాదాపు రూ. 1444.4 కోట్లని ఫైనాన్షియ‌ల్ టైమ్స్ రిపోర్ట్ పేర్కొంది. పాలిష్ వ్యాపారి జాన్ కుల్జిక్ కూతురు డొమినిక కుల్జిక్ ఈ ప్రాప‌ర్టీని పూనావాలాకు విక్ర‌యించింద‌ని స‌మాచారం. పూనావాలా కుటుంబానికి చెందిన సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా బ్రిటిష్ స‌బ్సిడ‌రీ సీరం లైఫ్ సైన్సెస్ ఈ ప్రాప‌ర్టీని సొంతం చేసుకుంది.