గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌

ఈసారి బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనతో ఒక్కసారిగా బంగారం ధర పతనమైంది. బంగారం, వెండి, ప్లాటినం వంటి విలువైన లోహాలపై సుంకాల్లో సగానికిపైగా కోత పెట్టడంతో వాటి ధరలు మార్కెట్లో భారీగా పతనమయ్యాయి. ఇప్పటివరకూ బంగారం, వెండిపై 10 శాతం బేసిక్ కస్టమ్స్ ఉండగా, దీన్ని 5 శాతానికే పరిమితం చేశారు. దీనికి అదనంగా విధిస్తున్న వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ధి సుంకాన్ని 5 శాతం నుంచి 1 శాతానికి పరిమితం చేశారు.