భాష ఏదైనా.. ఆ భాషల్లోని మాండలిక మేదైనా.. గుక్క తిప్పుకోకుండా డైలాగ్ చెప్పగలిగే కెపాసిటీ ఉన్న బాలయ్య.. అన్ స్టాపబుల్ వేదికపై తాజాగా అదే చేశారు. అచ్చ తెలుగులో కాకుండా.. హిందీలో గుక్కతిప్పుకోకుండా ఓ డైలాగ్ విసిరారు. ఆ డైలాగ్‌తోనే.. తన ఎదురుగా కూర్చున్న బాలీవుడ్ హీరో రణ్బీర్ కపూర్‌ను ఒక్కసారిగా షాక్ అయ్యేలా చేశారు. లేచి నిలబడి మరీ చప్పట్లు కొట్టేలా చేసుకున్నారు.