కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. చోరకళలో రోజు రోజుకీ డెవలప్ అవుతున్నారు. కొత్త కొత్త ఎత్తులతో అమాయకులను బకరాలను చేసి దోచేస్తున్నారు. తాజాగా జగిత్యాల జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. కొందరు దుండగులు ఓ వ్యక్తికి రోడ్డుమీద 100 రూపాయలు చూపించి.. అతని బైకులోనుంచి లక్షన్నర కొట్టేసి పారిపోయారు. ఆ తర్వాత విషయం గ్రహించి లబోదిబోమంటూ ఆ బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ఎస్బిహెచ్ బ్యాంక్ నుంచి శ్రీహరి అనే వ్యక్తి తన సొంత అవసరాల కోసం 1,50,000లు డ్రా చేసుకున్నారు. తన ద్విచక్ర వాహనంలో ఈ డబ్బులను పెట్టుకున్నాడు. ఇదంతా కొందరు వ్యక్తులు గమనించారు. శ్రీహరి బ్యాంకుకు వెళ్లడం.. డబ్బు డ్రా చేయడం.. అది తీసుకొచ్చి అతని బైక్‌లో పెట్టుకోవడం అన్నీ పరిశీలించారీ కేటుగాళ్లు. శ్రీహరి కూడా బ్యాంకు నుంచి బయటకు వచ్చి చుట్టూ ఏమీ గమనించలేదు.