స్టార్ హీరోయిన్ సమంత.. నాగ చైతన్యతో విడాకుల తర్వాత ఒంటరిగానే ఉంటున్న విషయం తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట మనస్పర్థల కారణంగా విడిపోయారు. ఆ తర్వాత ఇద్దరూ వారి వృత్తిలో బిజీ అయిపోయారు. అయితే, విడాకుల తర్వాత సమంత మయోసైటీస్ వ్యాధి బారిన పడడంతో కొంతకాలం సినిమాలకు దూరమైంది. ఈ క్రమంలో ఇటీవల చైతూ రెండో పెళ్లికి రెడీ అయ్యారు.