Viral పాడేరు మన్యంలో వింత ఆచారం - Tv9

ఇప్పటి వరకూ మీరు రకరకాల ఉత్సవాల గురించి విని ఉంటారు. చూసి ఉంటారు కూడా.. అయితే ముళ్ల ఊయల ఉత్సవం గురించి ఎప్పుడైనా విన్నారా? మన దేశంలో వివిధ ప్రాంతాల్లో వివిధ ఆచార సంప్రదాయాలు ఆచరిస్తారు. ఇక గిరిజనుల సంప్రదాయాలగురించి చెప్పనక్కర్లేదు. వారి ఆచారాలు కాస్త భిన్నంగా ఉంటాయి. ఆచారం, సంప్రదాయం ఏదైనా.. అందరి ఉద్దేశం దైవాన్ని ఆరాధించడమే. ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరిజిల్లా పాడేరులోని గిరిజనులు కార్తీక పౌర్ణమి సందర్భంగా వింత సంప్రదాయాన్ని ఆచరిస్తారు.