ఉద్యోగులు తమ మానసిక పరిస్థితి ఎలా ఉన్నా విధులకు హాజరు కాక తప్పదు. అలాంటి పరిస్థితుల్లో ఆఫీసుకు వెళ్లినా అన్యమనస్కంగానే పనిచేస్తారు. అయితే మనసు బాలేనప్పుడు ఆఫీసుకు రావద్దంటోంది ఓ కంపెనీ. ఆరోజు సెలవు తీసుకోమంటోంది. సూపర్... అర్జంటుగా ఆ కంపెనీ ఏంటో తెలుసుకోవాలనిపిస్తోందా.. కానీ ఈ బంపర్ ఆఫర్ ఇచ్చింది ఇండియాలో కాదు.. చైనాలో. చైనాకు చెందిన ఓ ప్రైవేటు కంపెనీ తన ఉద్యోగులకు ఇచ్చిన ఆఫర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.