తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులను మెప్పించిన నటుడు చంద్రమోహన్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నవంబర్ 11 శనివారం రోజున మృతి చెందారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్, కృష్ణవంశీ కాంబోలో వచ్చిన రాఖీ మూవీ షూటింగ్ సమయంలో చంద్రమోహన్ కు గుండెపోటు వచ్చింది. దీంతో డాక్టర్లు బైపాస్ సర్జరీ చేశారు. అప్పటివరకు ఏడాదికి 30 నుంచి 40 సినిమాలు చేస్తూ వచ్చిన చంద్రమోహన్ రాఖీ సినిమా తరువాత సినిమాలను పూర్తిగా తగ్గించేశారు.