తీవ్ర అనారోగ్యంతో నడవలేని స్థితిలో ఉన్న వృద్ధురాలిని ఎత్తుకుని మోసుకెళుతున్న మహిళను చూసి అక్కడున్న జనం అవాక్కయ్యారు. పెద్దామెకు ఎంత కష్టం వచ్చిందోనని బాధపడుతూనే మరో వైపు స్ట్రెచర్ అందుబాటులో లేకపోవడం సిబ్బంది నిర్లక్ష్యం పై జనం చర్చించుకున్నారు. ఈ అమానవీయ ఘటన తమిళనాడు రాష్ట్రం ఈరోడ్ ప్రభుత్వాస్పత్రిలో చోటు చేసుకుంది.