చోరీలు చేస్తూ పోలీసులకు మస్కా కొట్టే కవలలు

కొన్నేళ్లుగా వరుస దొంగతనాలు చేస్తూ చాకచక్యంగా తప్పించుకు తిరుగుతున్న భలే బ్రదర్స్ ఆట కట్టించారు మధ్యప్రదేశ్‌లోని మౌగంజ్ సిటీ పోలీసులు. సౌరభ్ వర్మ, సంజీవ్ వర్మ దొంగతనాలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఒకరు దొంగతనాలు చేస్తే, మరొకడు వేరేచోట చక్కర్లు కొడుతూ ఆ సీసీ టీవీ పుటేజీ చూపించి తప్పించుకుంటారు.