మళయాళ నటికి లైంగిక వేధింపులు.. పోలీసులకు ఫిర్యాదు - Tv9

ప్రముఖ మలయాళ నటి దివ్య ప్రభకు చేదు అనుభవం ఎదురైంది. విమానంలో ఆమె లైంగిక వేధింపులకు గురైంది. దివ్య.. మంగళవారం ముంబై నుంచి కొచ్చి కి ఎయిర్‌ ఇండియా AI 681 విమానంలో ప్రయాణించింది. ఆ సమయంలో పక్క సీటులో ఉన్న వ్యక్తి తనను వేధింపులకు గురి చేసినట్లు నటి చెప్పింది. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది.