ఇజ్రాయెల్, హమాస్ కాల్పుల విరమణ పాటించాలని ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అమెరికా అడ్డుకున్న తర్వాత గాజాపై దాడులను ఇజ్రాయెల్ దళాలు తీవ్రతరం చేశాయి. హమాస్ నెట్‌వర్క్‌ను అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దళాలు భీకర దాడులు చేస్తున్నాయి. ఈ క్రమంలో గాజాలో మానవతా సాయంపై అంతర్జాతీయ సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఆదివారం ఉదయం దక్షిణ గాజాలోని ఖాన్ యునిస్ నగరం నుంచి ఈజిప్టు సరిహద్దుల్లోని రఫా నగరానికి వెళ్లే రహదారులను లక్ష్యంగా చేసుకుని బాంబు దాడులు చేసినట్లు హమాస్ తెలిపింది. మరోవైపు హమాస్ నెట్‌వర్క్‌ను అంతం చేయడమే తమ అంతిమ లక్ష్యమని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు మరోసారి స్పష్టం చేశారు.