తెలంగాణలో కుప్పకూలిన విమానం.. A Training Aircraft Crashed At Toopran - Tv9

మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణం పరిధిలో ఓ శిక్షణా విమానం కుప్పకూలిపోయింది. రావెల్లి సమీపంలోని టాటా కాఫీ కంపెనీ వద్ద సోమవారం ఉదయం శిక్షణ విమానం కూలిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో ఇద్దరు సిబ్బంది ఉన్నట్టు సమాచారం. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరి ఆచూకీ తెలియాల్సి ఉంది. దుండిగల్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన శిక్షణ విమానంగా తెలుస్తోంది. విమానంలో సాంకేతిక లోపం కారణంగా ఒక్కసారిగా కూలిపోయినట్టు భావిస్తున్నారు. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి విమానం పూర్తిగా కాలిపోయింది.