ఈ క్షణం నుంచే హెల్మెట్ మస్ట్.. లేకపోతే జాగ్రత్త !!

హైదరాబాద్‌లో ఇక నుంచి హెల్మెట్‌ లేకుండా టూ వీలర్‌ నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. రాజధానిలో మూడు రోజుల్లోనే హెల్మెట్‌ లేకుండా వాహనం నడుపుతూ ముగ్గురు వాహనచోదకులు ప్రాణాలు కోల్పోయారని సిటీ ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు.