ఆహారం కోసం వెతుక్కుంటూ జనావాసాల్లోకి వచ్చేస్తుంటాయి పాములు. గ్రామాల్లో అయితే ఇవి ఇళ్లలో చొరబడినప్పుడు కోళ్ల గూటిలో చేరి అక్కడ గుడ్లను మింగేస్తుంటాయి. అలా ఓ చోట గుడ్డును మింగిన పాము అక్కడినుంచి బయటకు రాలేక.. ఆ గుడ్డును కక్కలేక... మింగలేక నానా అవస్థలు పడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.