భద్రాచలం గోదావరిపై రెండవ బ్రిడ్జికి శంకుస్థాపన చేసి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 సంవత్సరాలు అయింది. అప్పటినుంచి వంతెనపనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇటీవల రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఈ బ్రిడ్జి నిర్మాణం పనులను పరిశీలించి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. త్వరగా పనులు పూర్తి చేసి ఏప్రిల్ 17న జరుగే శ్రీరామనవమి నాటికి రెండవ బ్రిడ్జిపై నుండి రాకపోకలు కొనసాగాలని, పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.